తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు. జూలై 26న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 38,091 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 31,578 మంది హాజరయ్యారు. తెలంగాణలోని పలు కాలేజీల్లో రెండేళ్ల బీఈడీ రెగ్యులర్ కోర్సులో ప్రవేశాలకు ఎడ్‌సెట్ పరీక్షను నిర్వహిస్తారనే విషయం తెలిసిందే.ఇందుకోసం ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://edcet.tsche.ac.in/ ను ఓపెన్ చేయాలి. అనంతరం అభ్యర్థి తన పుట్టిన తేదీ, రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే రిజల్ట్స్ స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.