తెలంగాణలో ఐసెట్-2022 ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు జరగనున్నాయి. మొత్తం 61,613 మంది విద్యార్థులు ఈ ఏడాది ఐసెట్‌లో అర్హత సాధించారు.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్వర్దన్ మొదటి ర్యాంకు సాధించగా.. కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేశ్చంద్రరెడ్డి రెండో ర్యాంకు కైవసం చేసుకున్నారు.