తెలంగాణ ఇంటర్ విద్యార్థులు బీ అలెర్ట్..ఆ నెలలో ఫలితాలు విడుదల

0
125

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా జరుగుతాయని అంతా భావించిన క్రమంలో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగాయని..అయినా సిబ్బంది కష్టపడి పని చేశారని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తెలిపారు. అయితే ఇంటర్ ప్రధాన పరీక్షలు పూర్తి అయ్యాయని.. ఇంకా రెండు చిన్న పరీక్షలు మిగిలి ఉన్నాయని తెలిపారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కారణంగా పలుసార్లు పరీక్షలు రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం తెలంగాణ ఇంటర్ విద్యార్థులు రాసిన పరీక్షల ఫలితాలను జూన్ 20 లోపు విడుదల చేస్తామని స్పష్టం చేసారు. 15 కేంద్రాల్లో పేపర్ వాల్యూయేషన్‌ జరుగుతుందని.. 15 వేల మంది పేపర్ వాల్యూయేషన్‌ లో  పాల్గొంటునట్టు తెలిపారు.