ముఖర్జీ సింగ్ ఫైనాన్స్ వ్యాపారం చేసేవాడు, అయితే అతని దగ్గర డబ్బులు తీసుకున్న పంకజ్ భునాల్ ఇద్దరూ కూడా ముఖర్జీకి నగదు ఇవ్వలేదు, దీంతో ముఖర్జీ ప్రశ్నించే సరికి పదేళ్ల క్రితం అతనిని ఈ ఇద్దరూ చంపారు, తర్వాత ఇద్దరూ జైలు జీవితం గడిపి, గత మూడు నెలల క్రితం బయటకు వచ్చారు, అయితే ఇద్దరూ జైలుకు వెళ్లడంతో వారి పరువు పోయింది.
అక్కడ ఎవరూ వారి కుటుంబాలని పట్టించుకోలేదు, దీంతో వారి భార్యలు కూడా పుట్టింటికి వెళ్లిపోయారు, తాజాగా ముఖర్జీ సింగ్ కుమారుడు రైనా మాత్రం వారిద్దరిపై కోపం పెంచుకున్నాడు, తాజాగా వారిద్దిరిని పగతో చంపించేందుకు ఐదు లక్షల సుపారి ఇచ్చాడట ఓ గ్యాంగ్ కు తాజాగా..
ఈ సమయంలో పలువురుని చెక్ చేస్తున్న పోలీసులు రుషీపూర్ లో ఈ గ్యాంగ్ పై అనుమానంతో ప్రశ్నించారు.. దీంతో కత్తులు ఆయుధాలు దొరికాయి, దీంతో వారి గురించి పూర్తి వివరాలు అడిగితే ఈ విషయం చెప్పారు.. దీంతో ఈ గ్యాంగ్ ని ఆ సుపారీ ఇచ్చిన వ్యక్తిని అందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.