ఇక్క‌డ అధికారులు పార్కుల్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

ఇక్క‌డ అధికారులు పార్కుల్లో ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్

0
39

ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్దురా అంటే ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు.. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అంద‌రూ ఇంట్లో ఉండాలి అని చెబుతున్నారు, ఇది మ‌న దేశంలోనే కాదు అన్నీ దేశాల్లోను ఇదే చెబుతున్నారు, కాని కొంద‌రు మాత్రం పోలీసుల క‌ళ్లుగ‌ప్పి త‌ప్పించుకు తిరుగుతున్నారు, స‌రుకులు మెడిస‌న్ ఇలా క‌బుర్లు చెబుతున్నారు. అందుకే చెప్పి చెప్పి విసుగువ‌చ్చింది ఇక్క‌డ అధికారుల‌కి.

స్వీడన్‌లోని లుండ్ పట్టణంలో అధికారులు ఏకంగా కోడి పెంటను చల్లుతూ ప్రజలను ఇళ్లల్లోకి రాకుండా చేస్తున్నారు. అవును పోలీసులు చెప్పినా స‌రే చాలా మంది అక్క‌డ పార్కుల్లో వ‌చ్చి కూర్చుంటున్నారు గుంపులుగా తిరుగుతున్నారు, ఇలా పోలీసులు వెళ్ల‌గానే అలా పార్కుల్లోకి వ‌చ్చి కూర్చుంటున్నారు, దీంతో పోలీసులు చిరాకు వ‌చ్చింది.

దీంతో అధికారులు కోడి పెంటను తీసుకెళ్లి.. పార్కుల్లో డంప్ చేస్తున్నారు. ఆ కంపును భరించలేక ప్రజలకు బయటకు వెళ్లడం లేదు. రెండు రోజుల క్రితం సెంట్రల్ పార్క్‌లో మత ప్రార్థనల కోసం ప్రజలంతా ఒక్కచోటే చేరారు. దీంతో షాకైన అధికారులు.. మళ్లీ అలాంటి సమావేశాలు జరగకుండా అన్ని పార్కుల్లో కోడి రెట్టలతో తయారు చేసిన పెంటను డంప్ చేశారు. దీంతో ఒక్క‌రూ కూడా బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ట‌.