తాళికట్టే సమయంలో పెళ్లి వద్దన్న పెళ్లి కూతురు- ప్రేమికుడు ఎంట్రీ తర్వాత ఏమైందంటే

తాళికట్టే సమయంలో పెళ్లి వద్దన్న పెళ్లి కూతురు- ప్రేమికుడు ఎంట్రీ తర్వాత ఏమైందంటే

0
99

ఇటీవల కొందరు అమ్మాయిలు వివాహం చేసుకునే సమయంలో కరెక్టుగా తాళికట్టే సమయంలో తనప్రియుడ్ని కల్యాణ మండపానికి పిలుస్తున్నారు.. లేకపోతే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెబుతున్నారు, ఇలా పెళ్లిళ్లు ఆగిపోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరిగింది. పెళ్లికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, ప్రేమికుడు ఎంటర్ అవ్వడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో ఆ అమ్మాయి చెన్నైలో ఉద్యోగం చేస్తోంది, మరో కుటుంబానికి చెందిన యువకుడితో తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్ చేశారు, అయితే తాళికట్టే సమయంలో ఆ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది, ఈలోగా పోలీసులు ఎంటర్ అయ్యారు, ప్రేమికుడు కంప్లైంట్ తో ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు అని తల్లిదండ్రులని ప్రశ్నించారు.

మొత్తం పంచాయతీ స్టేషన్ కు వెళ్లింది, అయితే ఆమె మాత్రం తాను ప్రియుడితో వెళ్లిపోతాను అని చెప్పింది, దీంతో పెళ్లికొడుకు కుటుంబం అక్కడ నుంచి వారి సొంత గ్రామానికి వెళ్లిపోయారు, అయితే అందరూ ఈ విషయంలో ఆ అమ్మాయినే అంటున్నారు, ఆమె పెళ్లికి ముందు ప్రియుడితో ఉన్న ప్రేమ గురించి పెళ్లి కొడుక్కి చెబితే పెళ్లిఆగిపోతుంది కదా, అనవసరంగా పెళ్లి కొడుక్కి ఆశలు పుట్టించి వారి పరువు బజారున పెట్టింది అంటున్నారు, తల్లిదండ్రులు బెదిరిస్తే ఇప్పుడు చేసిన ఈ ఘనకార్యం అప్పుడే
పోలీసులకు చెప్పవచ్చు కదా అంటన్నారు, మొత్తానికి ఈ ఘటన పెను సంచనలనం అయింది.