ఆ ఉద్యోగాలకు నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు..పరీక్ష తేదీలు ఖరారు

0
110

తెలంగాణాలో ఉద్యోగాల జాతర మొదలయిపోయింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగులకు చక్కని అవకాశాలు కల్పిస్తుంది. తెలంగాణాలో ఇప్పటికే పోలీస్ , గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తుంది. అయితే పోలీస్ ఉద్యోగాలకు ఈనెల 2న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఈరోజు రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉండనున్నది.

ఈ గడువు ఇటీవలే ముగియనుండగా రెండేండ్ల కరోనా కారణంగా యువతీ యువకులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో అభ్యర్థుల వయోపరిమితిని పెంచడంతో దరఖాస్తు ప్రక్రియ కూడా పొడిగించడం జరిగింది. అయితే ఈ అవకాశం నేటితో ముగియనున్న క్రమంలో పోలీస్ ఉద్యోగాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

పోలీసు శాఖ మొత్తం 17,291 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా..వివిధ ఉద్యోగాలకు ఇప్పటికే 13 లక్షల మంది దరఖాస్తు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇవాళ చివరి రోజు కావడంతో పాటు..వయో పరిమితి పెంపు కారణంగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేసారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలు కూడా అధికారులు ఖరారు చేసారు. ఆగస్టు 7న ఎస్‌ పరీక్ష, 21న కానిస్టేబుల్ పరీక్షలు జరిగే అవకాశముందని తెలిపారు.