పెళ్లిమండపంలో వధువు మృతి- ఆమె చెల్లితో పెళ్లి చేశారు ఎందుకంటే

The bride died in the wedding hall then he married his sister

0
114

 

పెళ్ళి అంటే రెండు కుటుంబాల బంధం ప్రేమ ఆప్యాయతలు. జీవితంలో కొత్త ఇళ్లు పెళ్లి ఈ రెండు ప్రతీ ఒక్కరికి ఎంతో గుర్తు ఉండిపోయే ఘట్టాలు.అందుకే వివాహం ఎంతో ఘనంగా చేసుకుంటారు. అయితే పెళ్లి మండపంలో అందరూ ఆనందంగా ఉన్న వేళ పెను విషాదం జరిగింది.. కాళ్ల పారాణి ఆరకముందే పెళ్లికూతురు పెళ్లి పీటలపై ప్రాణాలు వదిలింది.

ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లా సనద్పూర్లో ఈ విషాదం జరిగింది. ఇక్కడ సురభి అనే అమ్మాయికి మనోజ్ కుమార్ అనే వ్యక్తితో వివాహం నిర్ణయించి వారికి పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఇక పెళ్లి తంతు అవుతోంది.. ఈ సమయంలో పెళ్లికొడుకికి ఆమె దండ వేసి ఒక్క సారిగా కుప్పకూలి పడిపోయింది, వెంటనే వైద్యులని పిలిచారు.

ఆమె గుండెనొప్పితో చనిపోయింది అని వైద్యులు తెలిపారు, దీంతో ఇక ఆమె సోదరి అక్కడ ఉండటంతో ఇరు కుటుంబాలు చర్చించి అంగరంగ ఏర్పాట్లకు చేసిన ఖర్చు వృధా అవుతుందని భావించి వధువు సోదరిని మనోజ్కిచ్చి వివాహం జరిపించారు. ఇక అక్క లేదు అనే బాధ తన మనసులో ఉన్నా తల్లిదండ్రులు పెద్దలు చెప్పడంతో ఆమె కూడా ఈ వివాహానికి ఒప్పుకుంది.