పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగిన సిసిఐ

0
129

దేశంలో ఇటీవలే కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు. తాజాగా ఇంధన ధరలు కూడా పెంచి వాహనదారులకు ఊహించని షాక్ ఇచ్చారు.

వారం రోజుల క్రితం భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళి పెంచడంతో ధరలను వ్యతిరేకిస్తూ విశాఖ కలెక్టరేట్‌ ఎదుట వామపక్షాలు ధర్నాను నిర్వహించాయి. ఇంధన ధరలను తగ్గించాలంటూ డిమాండ్ చేసారు. దాంతో పాటు నినాదాలు చేస్తూ..ఈ విషయంపై స్పష్టత ఇచ్చేంత వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పెంచిన పన్నులు, ధరలు తగ్గించేంత ఇక్కడి నుండి కదలమని తెలిపాడు.