హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తీర్థయాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఇది కూడా ఒకటి. చార్ ధామ్ యాత్ర మే 3 తేదిన ప్రారంభం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. చార్ ధామ్ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్న క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మే 3 నుండి మే 13వ తేదీ వరకు 31 మంది భక్తులు మరణించినట్లు ఉత్తరాఖండ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ మరణాలకు అనారోగ్య సమస్యలే కారణమని ఆరోగ్య శాఖ తెలిపింది. అధిక రక్తపోటు, గుండెపోటు, కొండలు ఎక్కే క్రమంలో అలసట ప్రధాన కారణమని వైద్యులు నిర్దారింఛి భక్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే కొన్ని రోజులు విశ్రాంతి తీసుకొని యాత్రకు రావాలని ప్రభుత్వం సూచిస్తుంది.