గుడ్ న్యూస్..కోవోవాక్స్ వ్యాక్సిన్ ధర భారీగా తగ్గింపు

0
86

ప్రస్తుతం కరోనా సంక్షోభంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో    నిత్యావసర సరుకుల ధరలు కూడా పెంచడంతో  ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. అయితే ప్రస్తుతం కోవోవాక్స్ డోస్ ధర భారీగా తగ్గించి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రజలకు చక్కని శుభవార్త చెప్పింది. కోవోవాక్స్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధరను రూ.900 నుంచి రూ.225కి తగ్గించినట్లు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది.

అంతేకాకుండా వస్తు సేవల పన్ను కూడా తగ్గిస్తున్నట్టు ప్రభుత్వానికి నివేదించింది. ప్రైవేట్ ఆసుపత్రుల కోసం కోవోవాక్స్ ప్రతి డోస్ ధరను రూ. 900 నుండి రూ. 250 తగ్గించబోతున్నట్లు ఎస్‌ఐఐ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ప్రకాష్ కుమార్ సింగ్ మంగళవారం ప్రభుత్వానికి తెలియజేశారు. కానీ అదనంగా ప్రైవేట్ ఆసుపత్రిలో సేవా ఛార్జీగా రూ.150 వరకు వసూలు చేసే అవకాశం ఉందని తెలియజేసాడు.

ప్రైవేట్ టీకా కేంద్రాలలో 12-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇమ్యునైజేషన్ కోసం టీకాలు వేయడానికి  CoWIN పోర్టల్‌లో Kovovax వ్యాక్సిన్‌ను చేర్చిన ఒక రోజు తర్వాత SII ఈ నిర్ణ‌యం తీసుకుంది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ సిఫార్సును అనుసరించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కోవిన్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ఎంపికలో కోవోవాక్స్ సోమవారం చేర్చబడింది. Covovax ఇప్పుడు దేశవ్యాప్తంగా పిల్లలకు అందుబాటులో ఉందని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా వెల్లడించారు.