దిమ్మతిరిగే షాకిచ్చిన కొత్త కోడలు..ఫస్ట్ నైట్ రోజే అలా..

0
100

పెళ్లి జీవితంలో మరిచిపోలేని రోజు. అలాంటి రోజును ఎవరు మాత్రం గుర్తుంచుకోరు. అయితే కొత్తగా పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగుపెట్టింది కొత్త కోడలు. ఇంట్లో అడుగుపెట్టిన ఆ జంటకు అత్తామామలు  స్వాగతం పలుకుతూ సంబరపడిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. అత్తామామకు, కట్టుకున్న భర్తకు దిమ్మతిరిగే షాకిచ్చింది కొత్త కోడలు. ఇంతకీ ఆ పెళ్లి కూతురు ఏం చేసింది? అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్‌లోని జైపూర్ జిల్లా కోట్‌పుట్లీ పట్టణానికి చెందిన వ్యక్తి, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ముగిశాక నవ వధువును పెళ్లి కొడుకు ఇంటికి తీసుకువచ్చారు. వారి ఫస్ట్ నైట్ కోసం పెద్దలు ఏర్పాటు చేశారు. ఇంతలో అందరూ కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త కోడలే వారికి భోజనం వడ్డించింది. తాను తప్ప.. భర్త, అత్త, మామ, ఇతర కుటుంబ సభ్యులందరికీ వడ్డించింది. ఆమె తినకపోవడంతో, మర్యాద పాటిస్తుందేమో అని భావించారు.

కానీ అక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఆ వడ్డించిన భోజనంలో మత్తు మందు కలిపింది పెళ్లి కూతురు. అది తెలియక.. ఆ భోజనం తిన్నవారంతా అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. ఇంకేముందు.. తన ప్లాన్ షురూ చేసింది. ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు అన్నీ ఎత్తుకెళ్లింది. మరుసటి రోజు ఉదయం బారెడు పొద్దెక్కినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోవడంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే లోపలికి వెళ్లి చూడగా.. అందరూ అపస్మాకర స్థితిలో పడిపోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తులో షాకింగ్ నిజాలు తెలుసుకున్నారు. పెళ్లి కూతురు పెద్ద చీటర్ అని, దొంగ పెళ్లిళ్లు చేసుకుంటూ జనాలను మోసం చేయడమే వారి పని అని తేల్చారు పోలీసులు.