ఏపీలో ఎలుగుబంటి ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగుబంటి దాటికి ఏకంగా ఏడుగురికి తీవ్రగాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కానీ నేటితో ప్రజలను ముప్పతిప్పలు పెట్టిన ఎలుగు బంటి కథ సుఖాంతం అయింది.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగు బంటికి మత్తు ఇంజక్షన్ షూట్ చేసి అటవీ అధికారులు పట్టుకున్నారు. కిడి సింగిలోని పశువుల పాకలో ఎలుగుబంటిని పట్టుకున్నట్టు అటవీ సిబ్బంది స్పష్టం చేసింది. మూడు రోజులుగా గ్రామస్తులపై దాడి చేస్తున్న ఎలుగును అటవీశాఖ , మత్తు నిపుణులు, వెటర్నరీ నిపుణులు తీవ్రంగా శ్రమించి పట్టుకోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.