నిందితుడి నుండే డబ్బులు కొట్టేసిన పోలీస్ ఇన్స్‌పెక్టర్..

0
99

సమాజం దొంగతనం చేస్తే కాపాడవలసిన పోలీస్ ఇన్స్పెక్టరే టైర్ల కంపెనీ యజమాని దగ్గర దొంగతనం చేసి పట్టుబడ్డాడు. అసలేం జరిగిందంటే..కొన్ని రోజుల క్రితం బేగంబజార్ కు చెందిన టైర్ల కంపెనీ యజమానిని చోరీ కేసులో రాచకొండ పోలీసులు అరెస్ట్ చేసారు. అనంతరం అతని దగ్గర ఉన్న పరికరాలను స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో డెబిట్ కార్డును కూడా తీసుకోవడం జరిగింది.

ఆ తరువాత నిందితుడు జైల్లో ఉన్న సమయం చూసి ఇన్స్పెక్టర్ బ్యాంక్ లో అతని అకౌంట్ నుండి రూ.5లక్షలు డబ్బులు డ్రా చేసాడు. అనంతరం బెయిల్ పై బయటకి వచ్చిన నిందితుడు చూడగా తన ఏటీఎం కార్డు నుంచి భారీ విత్‌డ్రాలను అయినట్టు గమనించాడు. దాంతో ఆయన బ్యాంకుకు వెళ్లి వివరాలు సేకరించగా ఏటీఎం ద్వారా డబ్బు డ్రా అయినట్లు అధికారులు వెల్లడించారు.

పోలీసులు సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు తీసినట్టు ఉన్నతాధికారులకు నిందితుడు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణ చేయాలనీ ఆదేశించారు. ఒక్క ఇన్స్పెక్టరే నిందితుడు ఏటీఎం కార్డ్ ద్వారా రూ.5లక్షలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విషయంపై ఇన్స్పెక్టర్ ను రాచకొండ పోలీస్ కమిషనర్ విచారిస్తున్నారు.