ఛీ… అభం శుభం తెలియని చిన్నారిని చెట్లపొదల్లోకి తీసుకువెళ్లి…

ఛీ... అభం శుభం తెలియని చిన్నారిని చెట్లపొదల్లోకి తీసుకువెళ్లి...

0
94

తెలంగాణలో దిశ హత్య సంఘటన జరిగిన తర్వాత ఏపీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల రక్షణ కోసం దిశా యాక్ట్ 2019ను తీసుకు వచ్చారు…ఈ చట్టం ప్రకారం ఎవరైనా నేరం చేస్తే వారికి 21రోజుల్లోపు శిక్షపడనుంది… ఇంత కఠినమైన చట్టం తీసుకువచ్చినా కూడా కామాంధుల్లో మార్పురాకుంది…

ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లి సమీపంలో దారుణం జరిగింది… అన్యం పుణ్యం తెలియని చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశారు… తినుబండరాల కోసం దుకాణానికి వెళ్లిన బాలికకు మాయమాటలు చెప్పి చెట్ల చాటుకు తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడబోయాడు…

అయితే వెంటనే బాలిక కేకలు వేయడంతో అక్కడనుంచి తప్పించుకున్నాడు… చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…