తిరుమల భక్తులకు గమనిక..ఆ రోజున శ్రీవారి ఆల‌యంలో బ్రేక్ దర్శనాలు రద్దు

Thirumala: Break darshans were canceled at Srivari temple on that day

0
104

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం బారులు తీరారు. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం, గోవింద రాజ సత్ర సముదాయాల వద్ద సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు భక్తులు.

ప్రస్తుతం ఆదివారానికి దర్శనం కేటాయిస్తోంది టీటీడీ. వయో వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో  మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.

బ్రేక్ దర్శనాల రద్దు నేపథ్యంలో మార్చి 28వ తేదీ సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి టిటిడికి సహకరించాలని కోరింది.