కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి హుండీ ఆదాయం ఎంతంటే?

0
103

కరోనా కష్టకాలంలోనూ తిరుమల శ్రీవారికి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గడం లేదు. నిన్న స్వామి వారిని 27,895 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే నిన్న 13,631 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీనితో శ్రీవారి హుండీ ఆదాయం 3.48 కోట్లు ఆదాయం సమకూరింది.

మరోవైపు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా, మూడురోజుల ముందు కరోనా పరీక్ష చేసుకున్న నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తీసుకురావాలని సూచించింది. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావొచ్చు.. భక్తుల సంఖ్యను పెంచడంతో భక్తుల ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

జ‌న‌వ‌రి 22నుంచి 26వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. జ‌న‌వ‌రి 27న చివ‌రిరోజు ఉద‌యం 6.30 నుండి 8.30 గంట‌ల వ‌రకు చ‌తుష్టానార్చ‌న‌, హోమాలు, మ‌హాప్రాయ‌శ్చిత్త హోమం, మ‌హాశాంతి హోమం నిర్వ‌హిస్తారు.