తిరుమల కిటకిట..స్వామి హుండీలు గలగల.. ఆదాయం ఎంతంటే?

0
125

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తూ కొంత మేరకు ఆదుకుంటున్నారు. ఇంకా నిన్న భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. 29 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచిఉన్నారని వీరికి 9 గంటల్లో దర్శనం అవుతుందని వెల్లడించారు.

అంతేకాకుండా నిన్న హ‌నుమ‌జ్జయంతిని పుర‌స్కరించుకుని ఆకాశ‌గంగ, జ‌పాలి తీర్థంలో నిర్వహించిన భ‌క్తి సంగీత కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించడంతో పాటు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు సైతం ఈ అంగరంగవైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.11 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.