వీకెండ్‌లో విహారానికి ఇదే బెస్ట్ స్పాట్..ఇంతకీ ఎక్కడుందంటే?

0
58

మనలో చాలామంది ప్రకృతి అందాలను చూసేందుకు వివిధ పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు. పచ్చని ప్రకృతి రమణీయతలో పారవశ్యం పొందాలని ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా జలపాతాల వద్ద పర్యాటకుల సందడి అంతా ఇంతా కాదు. మరి ఈసారి వీకెండ్ కి ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లాలన్నా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలన్న ఇదే బెస్ట్ స్పాట్..

శంషాబాద్ దగ్గరలో ఉన్న నానాజీపూర్ వాటర్ ఫాల్స్ వద్ద పచ్చని ప్రకృతి..మరోవైపు జలపాతాల సవ్వడి.. ఇంకోవైపు పక్షుల కిలకిలరావాలు ఇలా చుట్టూ పరిసరప్రాంతాల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.  శంషాబాద్ నుంచి మల్కారం వెళ్లేటప్పుడు రాయన్నగూడకు ఎడమవైపు మళ్లితే నానాజీపూర్ వస్తుంది. శంషాబాద్​ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది నానాజీపూర్ జలపాతం ఉంటుంది.
తిమ్మాపూర్ర్ లో ఉన్న పాలమాకుల్ చెరువు నిండితే ఆ నీళ్లు హిమాయత్ సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్తాయి. ఆ మధ్యలో ఉన్న కొండరాళ్ల మీదుగా నీళ్లు జాలువారి నానాజీపూర్​ జలపాతంగా మారాయి.
ఈ వాటర్ ఫాల్‌‌‌‌‌‌‌‌కు దగ్గరలో 17వ శ‌‌‌‌‌‌‌‌తాబ్దంలో కట్టిన అమ్మప‌‌‌‌‌‌‌‌ల్లి సీతా రామ‌‌‌‌‌‌‌‌చంద్ర స్వామి ఆల‌‌‌‌‌‌‌‌యం కూడా ఉంటుంది. ఫొటో షూటింగ్స్, సినిమా షూటింగులకు ఈ స్పాట్ చాలా ఫేమస్ అని చెప్పుకుంటుంటారు.