మనం ఎక్కువగా ఎర్రచందనం గురించి వార్తలు వింటాం. అంతే కాదు గంధపు చెక్క ఎర్రచందనం ఇలాంటివి అత్యంత ఖరీదైన కలపగా చెబుతారు. ఇక చైనా వుడ్, రోజ్ వుడ్ ని కూడా అతి ఖరీదైన వుడ్ గా చెబుతారు. అయితే ప్రపంచంలో ఇదే అత్యంత ఖరీదైన కలప అని మనం అనుకుంటాం. కాని దీని కంటే విలువైన కలపలు ఉన్నాయి. అవి చాలా మందికి తెలియదు. ఏకంగా ఈ కలప బంగారంతో సమానంగా విలువ ఉంటుంది.
మరి ఏమిటి దాని ష్పెషాలిటి అనేది చూస్తే? గంధపు చెక్క అతి ఖరీదుగా చూస్తాం. గంధపు చెక్క ఖరీదు కిలోకు ఐదు నుండి ఆరు వేల రూపాయలు వరకూ ఉంటుంది. కాని ఈ కలప పేరు ఆఫ్రికన్ బ్లాక్ ఉడ్ .ఈ కలప భూమిపై అత్యంత విలువైన వాటిలో ఫస్ట్ ఉంటుంది.దీని ధర కిలో 7.5 లక్షలు సో దాని బట్టీ అర్దం చేసుకోవచ్చు దీని ధర ఎంత ఎక్కువ ఉంటుందో.
ఆఫ్రికన్ బ్లాక్వుడ్ చెట్లు ఆఫ్రికాలోని పొడి ప్రాంతాలలో సెనెగల్ తూర్పు నుండి ఎరిట్రియా దక్షిణాఫ్రికాలోని ఈశాన్య భాగాలలో కనిపిస్తాయి. ఇవి ఇక్కడ మాత్రమే చాలా అరుదుగా ఉంటాయి మరెక్కడా ఉండవు. 25-40 అడుగులు పొడవుగా ఉంటాయి.
అయితే ఇవి 60 ఏళ్లకు ఎదుగుతాయి. అప్పటి వరకూ మనం వాటిని అమ్మలేము. వీటిని కూడా సీక్రెట్ గా సరిహద్దులు దాటిస్తున్నారు . మరి వీటితో ఏం చేస్తారు అంటే వేణువు, గిటార్ వంటి సంగీత వాయిద్యాలను తయారు చేస్తారు. అంతేకాదు బాగా ధనవంతులు వీటితో ఫర్నిచర్ తయారు చేయించుకుంటారు.