కప్పని గాల్లోకి లేపేసింది ఈ కందిరీగ – ఈ వీడియో చూస్తే మతిపోతుంది

చివరకు ఆ కప్ప ఓడిపోయింది

0
92

ఈ సృష్టిలో నిత్యం ఆహారం కోసం జంతువులు పోరాటం చేస్తాయి. చిన్న జీవులని పెద్ద జంతువులు ఆహారంగా తీసుకుంటాయి. ఇది ఆహార సైకిల్ అనే చెప్పాలి. ఈ భూమిపై ఒక్కో జీవి ఒకొక్క స్టైల్ లో ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కప్ప నేల మీద నీటిలోపల కూడా తన ఆహారం సంపాదించుకుంటుంది. అది ఉభయచరం అనేది తెలిసిందే. ఇక అది ఆహారం కోసం స్ధిరంగా ఓ చోట ఉంటుంది. దాని దగ్గరకు ఏదైనా జీవి వచ్చింది అంటే దానిని పట్టేస్తుంది.

ఆ కప్ప దగ్గరకు వచ్చే క్రిమికీటలను తన నాలికతో అందుకుని గుటుక్కుమనిపిస్తుంది. అంతేకాదు గాలిలో కీటకాలను నాలుకతో లాక్కొని మింగేస్తుంది. అయితే ఓ కప్పకు తన నాలుకే శాపమై తనలో పదవ వంతు బరువు కూడా లేని ఓ పురుగుకి చిక్కింది. ఏకంగా ఆ పురుగు ఆ కప్పకి చుక్కలు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ కప్ప కూర్చుని తనవైపు వచ్చిన పురుగులను నాలుకతో కరచుకొని తింటుంది. అదే సమయంలో ఓ కందిరీగ కూడా కప్ప దగ్గరకు రావడంతో దాన్ని కూడా కప్ప నాలుకకు కరుచుకుంది. ఆ కందిరీగను పూర్తిగా నోట్లోకి లాక్కోలేకపోయింది. దీంతో ఆ కందిరీగ కు బలం వచ్చింది. విప్పిన రెక్కలతో బలంగా ఎగడానికి ప్రయత్నించింది. చివరకు బలంగా ఆ కందిరీగ గాల్లోకి ఎగిరింది. కప్ప కూడా పైకి ఎగిరింది. చివరకు ఆ కప్ప ఓడిపోయింది. మీరు ఈ వీడియో చూడవచ్చు.