బ్రహ్మంగారి మఠం మఠాధిపతి అంశంపై మూడు ఉత్తర్వులు జారీ

Three orders were issued against the abbot of Brahmangari Math

0
96

శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం మఠాధిపతి శివైక్యం తర్వాత తదుపరి మఠాధిపతి నియామకం అంశం లో వివాదం & ద్వితీయ భార్య శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ రెండుసార్లు న్యాయస్థానంను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

టిటిడి ఈవో సంతకం లేనందున సాంకేతిక అంశంతో ఫిట్ పర్సన్ నియామకం రద్దు చేసింది సింగిల్ న్యాయస్థానం అయితే నియామకం తమ పరిధి కాదు అని తొలిసారి సింగిల్ బెంచ్ తేల్చి చెప్పింది. అయిననూ మరోసారి న్యాయస్థానం ఆశ్రయించినపుడు కింది న్యాయస్థానం & మా న్యాయస్థానం పరిశీలించిన అంశాలు పక్కన పెట్టి ఆశావహులకు అవకాశం ఇచ్చి పరిశీలించి ధార్మిక పరిషత్ చట్ట నియమ నిబంధనల ప్రకారం రెండు నెలలలోపు నిర్ణయం తీసుకోమని ఉత్తర్వులు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు గత నెల 30 వ తేదీన మఠాధిపతి ఆశావహులు (తొలి కుమారుడు శ్రీ వెంకటాద్రి స్వామి ద్వితీయ కుమారుడు శ్రీ వీరభద్ర స్వామి మరియు ద్వితీయ భార్య శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ ప్రధమ కుమారుడు చిరంజీవి గోవిందస్వామి) ముగ్గురితో ధార్మిక పరిషత్ కమిటీ (మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కమీషనర్ & టిటిడి ఈవో) సమావేశపరిచి విచారణ చేసింది. ముగ్గురు మౌఖిక  వ్రాతపూర్వకంగా వాదనలు వినిపించారు. తదుపరి నిన్న ధార్మిక పరిషత్ మూడు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు.

మొదటి ఉత్తర్వులు.
30-10-2021 నాడు ధార్మిక పరిషత్ సమావేశమైంది. ద్వితీయ భార్య శ్రీమతి మారుతి మహాలక్ష్మమ్మ ప్రథమ కుమారుడుతో సహా మొదటి భార్య ప్రధమ & ద్వితీయ కుమారులు తమ న్యాయవాదితో మౌఖిక వ్రాతపూర్వకంగా వాదనలు వినిపించారు ఆధారాలు జత చేశారు. తృతీయ చతుర్థ కుమారులు హాజరయ్యారు. దివంగత మఠాధిపతి తన ద్వితీయ భార్య ప్రథమ కుమారుడిని నామినేట్ చేసిన పత్రాలు పంపించామని చెప్పారు. అయితే ప్రథమ భార్య కుమారులు ఆమె దావాని పూర్తిగా వ్యతిరేకించారు. సంప్రదాయం ప్రకారం తానే తదుపరి మఠాధిపతి అని ప్రథమ కుమారుడు తనకు కూడా వీలునామాలు రాశారు పరిశీలించండి అని ద్వితీయ కుమారుడు తమ వాదనలు వినిపించారు. అయితే దేవాదాయ శాఖ చట్టం సెక్షన్ 54(1) ప్రకారం మఠాధిపతి తాము బతికుండగానే దేవాదాయ ధర్మాదాయ శాఖ ధార్మిక పరిషత్ కి పంపి తగిన ఉత్తర్వులు పొంది ఉండాలి అయితే ఆ ప్రక్రియ చేయలేదు. కనుక మఠాధిపతి నియామకం సెక్షన్ 54 (1) ప్రకారం నియామకం కుదరదు అభ్యర్థనను తిరస్కరించడయినది. ప్రస్తుతం సెక్షన్ 54(2) ప్రకారం అక్కడి సంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారం ఇదే సంప్రదాయం అనుసరించే మఠాధిపతుల నిర్ణయం మేరకు తదుపరి మఠాధిపతి నియామకం చేయవలసి ఉన్నది. అందుకు అనుగుణంగా మరో ఉత్తర్వులు జారీ చేయబడినది.

ఉత్తర్వులు 2:
సెక్షన్ 54 (1) ప్రకారం మఠాధిపతి నియామకం కుదరదు కనుక సెక్షన్ 54 (2) ప్రకారం ఇదే సంప్రదాయం అనుసరించే మఠాధిపతులు గుర్తించి సమావేశం ఏర్పాటు చేయుట కొరకు తదుపరి నివేదిక ఇచ్చుటకు ఒక ప్రత్యేక అధికారి నియమిస్తూ తదుపరి ఉత్తర్వులను జారీ చేయడమైనది.

ఉత్తర్వులు 3:
మఠాధిపతి నియామకంలో వివాదం ఉన్నందున గత కొన్ని నెలలుగా మఠంలో హుండీలు నిండినందున జీతాలు కూడా ఇవ్వనందున విద్యుత్ బాకాయిలు చెల్లించనందున పూజలు వగైరా నిధులకు తదుపరి మఠాధిపతి నియామకం జరిగే వరకూ ఆదాయ వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా చట్టంలో నిబంధనల మేరకు ఫిట్ పర్సన్ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినది.

బ్రహ్మంగారి మఠం మఠాధిపతి అంశంలో ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు అనుగుణంగా వ్రాతపూర్వక నివేదిక తయారీలో తగిన ఆధారాలు సేకరణలో మా బావ గారు శ్రీ వెంకటాద్రి స్వామి నాపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందున గత కొంత కాలంగా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాను కనుకనే ముఖ పుస్తకంలో తక్కువ సమయం. ఈ ప్రక్రియలో విజయవంతం అయ్యాను నమ్మకాన్ని నిలబెట్టుకున్నాను అని చెప్పడానికి సంతోషం. మఠాధిపతి నియామకం ఇక నామమాత్రమే. అయితే మరోసారి న్యాయస్థానం ఆశ్రయించే సూచనలు కనపడుతున్నాయి. ద్వితీయ భార్య న్యాయస్థానం ఆశ్రయించడం వలన కాలయాపన తప్ప ఉపయోగం ఉండదు. న్యాయస్థానం ఇప్పటికే ధార్మిక పరిషత్ కి సంపూర్ణ అధికారం ఉందని తెలిపింది. నూటికి నూరు శాతం ఆధారాలు శ్రీ వెంకటాద్రి స్వామి వారికి అనుకూలం కనుక అయిననూ న్యాయస్థానం ఆశ్రయిస్తే వారికే నష్టం.

జగన్ సర్కార్ ఈ అంశంలో ఏ ప్రలోభాలకు లొంగకుండా పూర్తి నిజాయితీతో నియమ నిబంధనల ప్రకారం వ్యవహరించినందులకు నేను ప్రత్యక్ష సాక్షి & ధన్యవాదాలు. నిరంతరం తోడుగా నిలబడిన చిన్న బావ దత్తాత్రేయ గారికి మద్దతుగా నిలబడిన స్థానిక నాయకులు మద్దతు ఇచ్చి సంయమనం పాటించిన స్థానికులు, భక్తులకు ధన్యవాదాలు.