టీఎస్ పీజీఈసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ వివరాలు..

TS PGSET Final Phase Counseling Details ..

0
38

టీఎస్ పీజీఈసెట్-2021కు సంబంధించి సెకండ్, ఫైన‌ల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుద‌లైంది. ఈ నెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్ కొన‌సాగ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్ చేసుకోని అభ్య‌ర్థులు ఇప్పుడు రిజిస్ట్రేష‌న్ చేసి స‌ర్టిఫికెట్ల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.

ఫ‌స్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్య‌ర్థులు నేరుగా వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకోవ‌చ్చు. రెండో ఫేజ్‌లో పాల్గొనే అభ్య‌ర్థులు 27, 28 తేదీల్లో వెబ్ ఆప్ష‌న్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. 30వ తేదీన సీట్ల కేటాయింపు జ‌ర‌గ‌నుంది. సీట్లు పొందిన అభ్య‌ర్థులు డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచి 4వ తేదీ మ‌ధ్య‌లో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని షెడ్యూల్ లో తెలిపారు.