శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త..రేపటి నుంచి ఆ ఘాట్‌ రోడ్డులో రాకపోకలు..

TTD good news for Srivari devotees..traffic on that ghat road from tomorrow ..

0
72

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్‌ రోడ్డును అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఘాట్‌ రోడ్ మరమ్మతు పనులను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బా రెడ్డి పరిశీలించారు. జనవరి 11 రాత్రికల్లా ఘాట్‌ రోడ్డును భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 11 రాత్రి నుంచి భక్తులకు ఈ మార్గం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో ఘాట్ రోడ్డు వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.పెద్ద బండరాళ్లు పడడంతో..రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద రహదారి భారీగా కోతకు గురైంది.

దీంతో రెండో ఘాట్‌ రోడ్డులో వాహనాల రాకపోకలను టీటీడీ అధికారులు నిలివేశారు. ధ్వంసమైన ఘాట్‌ రోడ్డు మరమ్మతులు శరవేగంగా పూర్తి చేశారు. రేపటి నుంచి రెండో ఘాట్ రోడ్డు మీద నుంచి వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు.