టీటీడీ గుడ్ న్యూస్..వారికీ ప్రత్యేక దర్శన కోటా టికెట్లు విడుదల

0
125

కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తండోపతండాలుగా తరలివస్తున్నారు. దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తున్న క్రమంలో తాజాగా వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం నేడు విడుదల చేయనున్నట్టు తెలపడంతో వృద్దులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ వెల్లడించింది. అంతేకాకుండా వచ్చే నెల 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన సమయ వేళల్లో కూడా మార్పులు చేయాలనీ టీటీడీ నిర్ణయించింది. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తున్న క్రమంలో భక్తులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మలచుకొవాలని టీటీడీ  కోరింది.