తిరుమల తిరుపతి శ్రీవారి దర్శన టికెట్ల పై టీటీడీ కీలక నిర్ణయం ?

TTD key decision on Tirumala Tirupati Srivari Darshan tickets

0
40

తిరుపతి: కరోనా మొదలైనప్పటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య తగ్గిన సంగతి తెలిసిందే.సర్వ దర్శనం టికెట్లను కూడా నిలిపివేసిన టీటీడీ రోజుకు ఐదు వేల చొప్పున ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తోంది.అయితే కోవిడ్ కారణంగా ఆ ఐదు వేల టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడు పోయేవి కావు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మెల్లమెల్లగా తగ్గుతూ వస్తోంది.

దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతున్న కారణంగా టీటీడీ కూడా భక్తుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక దర్శనం టికెట్లను పెంచాలని నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ రోజు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం కానుంది.ఈ సందర్భంగా దర్శనాల టికెట్ల పెంపు పలు కీలక అభివృద్ధి పనులపై సభ్యులు చర్చించనున్నారు.అలాగే తిరుపతి లో నిర్మిస్తున్న గరుడ వారధిని అలిపిరి వరకు పొడిగింపు పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ప్రస్తుతం గరుడ వారి తిరుచానూరు మార్కెట్ వద్ద నుంచి తిరుపతి కపిల తీర్థం వరకు నిర్మిస్తున్నారు.ఈ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్లై ఓవర్ అలిపిరి దాకా పొడిగించాలనే యోచనలో టీటీడీ ఉంది.

గత మే నెలలో టీటీడీ రోజుకు 15 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేసింది.టికెట్లు అందుబాటులో ఉన్నా భక్తులు కొనుగోలు చేయకపోవడంతో ఆ తర్వాత రోజుకు ఐదు వేల టిక్కెట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు.ఈ నెలలో రెండు రోజుల కిందట రోజుకు ఐదు వేల చొప్పున శ్రీవారి దర్శన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయగా వెంటనే టికెట్లు అన్ని అమ్ముడుపోయాయి.

ఈ నేపథ్యంలో దర్శన టికెట్ల కోటాను పెంచేందుకు బోర్డు సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.