TTD జ్యేష్ఠ‌ మాసంలో విశేష పూజా కార్య‌క్ర‌మాలు

TTD Special pooja programs in jesta masam

0
125

లోక కల్యాణార్థం జ్యేష్ఠ‌ మాసంలో ప‌లు విశేష పూజా కార్య‌క్ర‌మాలను టిటిడి నిర్వ‌హించనుంది. ఇప్ప‌టికే నిర్వహించిన కార్తీక, ధనుర్‌, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ‌ మాస ఉత్సవాల‌కు భక్తుల‌ నుండి విశేష ఆదరణ ల‌భించింది. శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయనుంది.
జూన్ 18న జ్యేష్ఠ శుద్ధ అష్ట‌మి సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు శుక్లా దేవ్య‌ర్చ‌నం జ‌రుగ‌నుంది.
జూన్ 21న‌ జ్యేష్ఠ శుద్ధ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల వ‌సంత‌మండ‌పంలో సాయంత్రం 3.30 నుండి 4.45 గంట‌ల వ‌ర‌కు విష్ణు అర్చ‌నం కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

జూన్ 24న జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ‌ సంద‌ర్భంగా తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాల‌యం యాగ‌శాల‌లో ఉదయం 8 నుండి 9 గంటల‌ వరకు వ‌ట‌సావిత్రీ వ్ర‌తం జ‌రుగ‌నుంది.