శుభవార్త..శ్రీవారి సర్వ దర్శనం టికెట్ల పెంపుపై టీటీడీ కీలక నిర్ణయం

0
91

శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి శుభవార్త చెప్పింది. శ్రీవారి ఆలయంలో సర్వదర్శనం టిక్కేట్లు పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీటీడీ.  రూ. 230 కోట్ల రూపాయల వ్యయంతో పద్మావతి చిన్నపిల్లల మల్టి స్పేషాల్టి హస్పిటల్ నిర్మాణం చేపట్టాలని, అలాగే ఆర్జిత సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

సుప్రభాతం రూ. రెండు వేలు, తోమాల, ఆర్చన రూ. ఐదువేలు, కళ్యాణోత్సవం రూ.రెండున్నర వేలకు పెంచాలని నిర్ణయం. అలాగే వేద ఆశీర్వచనం రూ. ఐదు వేలకు పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్విమ్స్ హస్పిటల్ ని పూర్తి స్థాయి అభివృద్ది చేస్తామని.. 2.7 కోట్ల రూపాయల వ్యయంతో స్వీమ్స్ హస్పిటల్ ని పూర్తిగా కంప్యూటికరణ చేయాలని టీటీడీ వెల్లడించింది.

తిరుమలలో అన్నప్రసాదాని మరిన్ని ప్రదేశాలలో భక్తులుకు ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అలిపిరి వద్ద సైన్సు సిటికి కేటాయించిన భూమిని వెనక్కి తీసుకోని ఆధ్యాత్మిక సిటి నిర్మిస్తామని.. నాదనీరాజనం మండపాని శాశ్వత ప్రాతిపాదికన నిర్మిస్తామని వెల్లడించింది. అన్నమయ్య మార్గాని భక్తులుకు సౌకర్యవంతంగా వుండేలా నడకమార్గంలా అభివృద్ది పర్చేలా చర్యలకు టీటీడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.