ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఏ సమయంలో చేసుకోవాలి

ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఏ సమయంలో చేసుకోవాలి

0
109

తెలుగు వారు అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఉగాది, అయితే ఈ పండుగతో తెలుగు సంవత్సరం ప్రారంభం అయింది అని చెబుతారు, అయితే ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి. ఇది దేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకుంటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.

 

చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది రోజు కచ్చితంగా పంచాంగ శ్రావణం చేస్తారు

ఎవరి రాశి ఎలా ఉంది నక్షత్రాలు వారి బలాలు గ్రహస్దితులు అన్నీ తెలియచేస్తారు…2021 ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.

 

ఈ సంవత్సరం ఉగాది ఏప్రిల్ 13న జరుపుకుంటారు.మరి ఉగాది సమయం ఎప్పుడు అనేది చూద్దాం.

ఏప్రిల్ 12 ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 13 ఉదయం 10.16 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో ఉగాది పచ్చడి చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టుకుని దేవాలయానికి వెళ్లి దేవుడ్ని దర్శించుకోవడం మంచిది.