పొట్ట కూటి కోసం వచ్చిన ఓ వ్యక్తి ముంబైలో పిచ్చివేషాలు వెకిలి చేష్టలు చేస్తూ పోలీసులకి అడ్డంగా దొరికాడు…ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాయ్‌జుర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. బతుకు తెరువు కోసం ముంబై వచ్చాడు. ఈ సమయంలో పని పాటా లేకుండా రైల్వే స్టేషన్ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై మాటువేసేవాడు.
అందమైన అమ్మాయిలు ఒంటరి మహిళలే అతని టార్గెట్… వారిని లక్ష్యంగా చేసుకునేవాడు, వారిని వెనకాలే వెళ్లి గట్టిగా పట్టుకునేవాడు వారు పట్టుకోవడానికి చూస్తే పారిపోయేవాడు, దీనిపై పోలీసులకి ఫిర్యాదు వచ్చింది,
దీంతో కొన్ని రోజుల సీసీ టీవీ ఫుటేజీలని పోలీసులు పరిశీలించారు.. అక్కడే మాటువేసి ఉన్న అతని వీడియోలు అతని దురాగతాలు కనిపించాయి.. దీంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు అతడిని పట్టుకున్నారు. దొంగతనం కేసులో అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. అతనిపై ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు కఠినచట్టాలు అతనిపై పెడతాము అంటున్నారు పోలీసులు.