వాస్తు నిపుణులు కృష్ణాదిశేషుకి ఘన సన్మానం

0
106

టీచర్స్ డే సందర్బంగా నిన్న భారత్ వికాస్ పరిషత్ కూకట్ పల్లిలో విశ్వగురు వరల్డ్స్ రికార్డ్స్ మరియు లయన్స్ క్లబ్ హైదరాబాద్ సంయుక్తంగా విశ్వగురు ఇంటర్నేషనల్ అవార్డీస్ ఉత్సవం 2022 ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ డైరెక్టర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పి మదన్మోహన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ ఉత్సవంలో భాగంగా వాస్తు నిపుణులు కృష్ణాదిశేషుకి ఘన సన్మానం చేయడం జరిగింది. వారితో పాటు ఈ కార్యక్రమంలో ఐఏఎస్ రిటైర్డ్ లక్ష్మీకాంత్ , లయన్ కోటేశ్వరరావు, వైస్ గవర్నర్ రాంబాబు, సిఈఓ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సాధన నర్సింహాచార్య, ఎఫ్ సి ఐ విశ్రాంత ఉన్నతాధికారి పాల్గొన్నారు.