వైర‌ల్ – కోతి చేసిన ప‌నికి ఉరితీశారు, ఇంత దారుణ‌మా

మూగ జీవిని వెంట‌నే కాపాడాలి కాని అత‌ను కోపంతో దానిని క‌ర్ర‌తో కొట్టి చంపాడు.

0
94

కొంద‌రు జంతువుల‌ని చాలా అమానుషంగా దారుణంగా హింసిస్తారు, అతి హీనంగా వాటి ప‌ట్ల ప్ర‌వ‌ర్తిస్తారు..
నీటి తోట్టిలో ఓ కొతి పడిందని ఆ కోతిని ఉరి తీసి చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకొంది.
ఈ ఘ‌ట‌న జ‌రిగింది అని తెలిసి జంతు ప్రేమికులు వారిని చంపేయాల‌ని ఉరిశిక్ష విధించాలి అని కోరుతున్నారు.

వేంసూరు మండలం అక్కపాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు అనే అతని ఇంటి ఆవరణలో నీటి తొట్టె ఉంది. ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి పడింది. అయితే ఆ మూగ జీవిని వెంట‌నే కాపాడాలి కాని అత‌ను కోపంతో దానిని క‌ర్ర‌తో కొట్టి చంపాడు.

చంపి దానిని అక్కడే పడేయ్యటంతో వందలాదిగా కోతులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. దీంతో అంద‌రూ షాక్ అయ్యారు, కాని బ‌తికి ఉన్న కోతిని చంపితే మిగతా కోతులు పారిపోతాయని చెప్పటంతో మరో కోతిని పట్టుకొని దానిని కూడా ఉరి వేసి కుక్కలతో కరిపించుకుంటూ కర్రలతో కొడుతూ అతి దారుణంగా చంపి కుక్కలకు ఆహారంగా వేశారు.