ఏ వేలుతో బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది? పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

0
104

బొట్టు పెట్టుకోవడం అనేది హిందూ సాంప్రదాయంలో ముఖ్యమైన ఆచారం. మహిళలు, ముఖ్యంగా ముత్తైదువులు బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు తప్పనిసరిగా అందరికి బొట్టు పెడతారు. అయితే చాలా మంది చేతిలోని రెండు మూడు వేళ్లను ఉపయోగించి బొట్టు పెడుతుంటారు. మరి ఏ వేలితో బొట్టు పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు ఓ లుక్కేయండి..

హిందూ పురాణాల ప్రకారం మధ్య వేలు శని స్థానం. ఈయన జీవితానికి భద్రత కలిగిస్తాడు. కాబట్టి మధ్యవేలితో నుదుటిపై తిలకం ధరిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుంది.

ఇక ఉంగరపు వేలు సూర్య స్థానం. అందుకే ఈ వేలుతో నుదుటన బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి. అంతేకాదు సూర్యుడి తేజస్సు, శక్తి కలుగుతాయి. అలాగే ఉంగరపు వేలుతో తిలకధారణ చేస్తే నుదుటిపై ఉండే జ్ఞానచక్రం ఉత్తేజితమై, మనిషి మేధస్సును మేల్కొల్పడానికి సహాయపడుతుంది. అందుకే దేవుడికి ఈ వేలుతోనే తిలకధారణ చేస్తారు.

బొటన వేలు శుక్ర స్థానం. ఈ గ్రహం ఆరోగ్యం ప్రసాదిస్తుంది. కాబట్టి బొటనవేలుతో తిలకం దిద్దుకుంటే ఆరోగ్యం, శక్తి కలుగుతాయి.

చూపుడు వేలు బృహస్పతి స్థానం. మరణించిన వారికి మాత్రం ఈ వేలుతో తిలకం దిద్దితే మోక్షం ప్రాప్తిస్తుంది. అమరత్వాన్ని కలిగించేది బృహస్పతి గ్రహం.

అందుకే మిగతా సందర్భాల్లో చూపుడు వేలుతో నుదుటిపై బొట్టు పెట్టడాన్ని అపవిత్రంగా భావిస్తారు. అందుకే ఆ వేలుతో బొట్టు పెట్టగడం, పెట్టు కోవడం చేయకూడదంటారు పెద్దలు.