ఉర్జిత్ కి వివాహం అయి పదేళ్లు అయింది, చివరకు అతను సరిగ్గా సంపాదన సంపాదించడం లేదని ఇంట్లో పోషణ కష్టం అవుతోంది అని భార్య అతనిని వదిలి పుట్టిన ఇంటికి వెళ్లిపోయింది, తాను మారాను ఉద్యోగం చేస్తాను ఇంటికి రమ్మని చెప్పినా ఈ లాక్ డౌన్ సమయంలో తాను రాను అని ఆమె చెప్పింది.
తాను ఓ 50 వేల రూపాయలు సంపాదించాను అని వాట్సాప్ లో ఫోటో తీసి నగదు పంపాడు, ఆమె రాను అని చెప్పింది, ఇక నువ్వు రాకపోతే నేను వేరే వివాహం చేసుకుంటాను అని చెప్పాడు, ఆమె అయినా పట్టించుకోలేదు.
దీంతో అతను ఇంటి పక్కన స్నూపీ అనే కుక్క పిల్లని తీసుకువచ్చి దాని మెడలో తాళికట్టి అది భార్యకు పంపాడు, ఈ విషయం ఆమెకి మెసేజ్ చేశాడు, దీంతో ఇంటి పక్కన వారు అతని నీచపు బుద్ది చూసి వికృత పనిపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు, అయితే తను భార్యని సరదాగా ఏడిపించడానికి చేశాను అని అన్నాడు ఈ భర్త.