ఫలాల్లో మామిడి రారాజు, ఈ మధుర ఫలం సమ్మర్ వచ్చింది అంటే ప్రతీ ఇంట్లో ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అయితే దీని రుచి కూడా అలాగే ఉంటుంది, సాధారణంగా మామిడి పెద్దవిగానే ఉంటాయి ఇక కొబ్బరి మామిడి అయితే రెండు చేతులతో పట్టుకోవాలి అంత పెద్దవిగా ఉంటాయి.
మామిడికాయలు మహా అయితే 2 కిలోల వరకు బరువు తూగుతాయి.
ఇవి కూడా కొన్ని రకాలు మాత్రమే అవి ధర అలాగే ఉంటాయి, కాని తాజాగా ఓ మామిడి పండు మాత్రం రికార్డు క్రియేట్ చేసింది..దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశ రైతులు మాత్రం అదిరిపోయే బరువుతో మామిడికాయలు సాగుతో అందరిచేత ప్రశంసలు పొందారు.
కొలంబియాలోని గ్వాయత్ ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి, అనేక రకాల మామిడి ఇక్కడ ఉంటుంది, ఇక బాహుబలి మామిడికాయ పండించారు రైతులు… అంటే ఇదే ప్రపంచంలో అతి పెద్ద మామిడికాయ..
జెర్మేన్ ఓర్లాండో బరేరా, రీనా మరియా అనే ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించారు. దీని బరువు 4.25 కిలోలు. ఇక దీని కంటే ముందు ఫిలిప్పీన్స్ కు చెందిన మామిడికాయ 3.435 కిలోలు రికార్డు ఉండేది ఇప్పుడు ఆ రికార్డు ప్లేస్ లో ఇది చేరింది.