తెలంగాణలో కరోనా లాక్ డౌన్ కారణంగా యాదాద్రి పుణ్యక్షేత్రం భక్తులు లేక వెలవెలబోతుంది. గతంలో భక్తులు అందించే ఆహారంతో ఆకలిని తీర్చుకునేవి యాదగిరి గుట్ట పరిసరాల్లో ఉన్న కోతులు . ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం దొరక్క ఆకలితో అలమటిస్తున్నాయి ఆ మూగజీవాలు. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ జానకిరెడ్డి కోతుల ఆకలి బాధను చూసి చలించిపోయాడు. ఈ విషయాన్ని సీఐ హైదరాబాద్లోని కొత్తపేట వాసవీ కాలనిలో నివాసం ఉంటున్న తన సోదరుడు చిలుక ఉపేందర్ రెడ్డి కి తెలుపగా, ఆయన సుమారు 7 ట్రేల అరటిపండ్లను యాదగిరిగుట్టకు పంపించాడు. సీఐ జానకిరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది కలిసి వానరాలకు అరటిపండ్లను అందించారు.
ఆ సందర్భంగా ముగ జీవుల ఆకలిని తీర్చడం ఎంతో ఆనందంగా ఉందన్నారు సీఐ జానకిరెడ్డి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అదే విధంగా మూగజీవాలకు దాతలు తమకు తోచిన సాయాన్ని లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ అందించాలని సీఐ జానకిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆయితే పోలీసులు యాదగిరి గుట్టలో కొతులకు అరటి పండ్లు తినిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.