డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చిటికెలో చెల్లింపులు చేయడానికి యుపిఐని ఆశ్రయిస్తున్నారు. లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. రోజు లక్షల ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి, ఇక కొందరికి డబ్బులు కట్ అవుతాయి, ఈ సమయంలో అవతల వారి ఖాతాలో డబ్బులు వెళ్లక కొందరు ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. కానీ ఆ డబ్బులు లబ్ధిదారుడి అకౌంట్లో జమకావు. మధ్యలోనే ఆగిపోతాయి. అయితే నెట్ వర్క్ ఇష్యూ వల్ల ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి.
యుపిఐ చెల్లింపులను నిర్వహించే సంస్థ ఎన్‌పిసిఐ కూడా ఎప్పటికప్పుడు దీని గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. ఈ సమయంలో ఖాతాదారులు డబ్బులు గురించి ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదు.
1. ఒకవేళ ఖాతా నుంచి నగదు తిరస్కరిస్తే ఆ నగదు రివర్స్ అవుతుంది.
2..మీకు నగదు రాకపోతే 24 గంటల తర్వాత అది మీరు బ్యాంకుకి ఫిర్యాదు చేయవచ్చు
3. బ్యాంకు నుంచి కూడా మీకు సరైన స్పందన లేకపోతే అంబుడ్స్‌మన్ స్కీమ్ ఆఫ్ డిజిటల్ లావాదేవీల కింద ఫిర్యాదు చేయవచ్చు అంబుడ్స్‌మన్ కి .
4. ఖాతాదారుడి నుంచి నగదు కట్ అయి అవతల వ్యక్తికి వెళ్లకపోయినా 48 గంటల్లో కచ్చితంగా నగదు జమ అవుతుంది.
5.మీ ఖాతా సమాచారం చాలా గోప్యంగా ఉంటుంది.