ప్రపంచ కప్ 2015లో తాను ఎదుర్కొన్న పరిస్థితులపై దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ AB డివిలియర్స్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘వెస్టిండీస్ తో మ్యాచ్ జరిగినప్పుడు నేను చాలా భయపడ్డాను. దీంతో తెల్లవారుజామున 3 గంటలకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాను. జ్వరం తగ్గేందుకు ఇంజెక్షన్లు తీసుకుని అన్ని వస్తువులను సిద్ధంగా ఉంచుకున్నాను’ అని తెలిపారు. అంత జ్వరం లోనూ ఆరోజు AB డివిలియర్స్ 66 బంతుల్లో 162 రన్స్ చేసినట్లు ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు. ఆయనపై అభిమానులు నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.