టీమ్ పాకిస్థాన్(Pakistan) కొంత కాలంగా అత్యంత పేలవమైన ప్రదర్శనతో అభిమానులు, సీనియర్ల నుంచి చివాట్లు తింటోంది. అసలు వీళ్లు ప్రొఫెషనల్ ఆటగాళ్లేనా అని కూడా ప్రశ్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో కూడా తీవ్ర నిరాశ, అసంతృప్తినే అందించిన పాక్ టీమ్. ఆ సిరీస్ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి బాబర్ అజామ్ రాజీనామా చేయడం పాక్ టీమ్‌కు భారీ షాక్‌లా తగిలింది. ఇప్పుడు కొత్త సారధి కోసం పాకిస్థాన్ నానా పాట్లు పడుతోంది. తాజాగా ఈ అంశంపై, టీమ్ పాకిస్థాన్ దుర్భర దుస్థితిపై భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్(Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో టీమ్‌లో కెప్టెన్సీ కోసం కుర్చీలాటల షురూ అయిందని, ఆ టీమ్‌కు ఉన్న అతిపెద్ద, అసలు సమస్య కూడా ఇదేనంటూ అశ్విన్ చెప్పుకొచ్చారు. ఎందరో బడాబడా ఆటగాళ్లు ఆడిన పాక్ టీమ్‌ను ఇప్పుడు చూస్తే అయోమయంలో కూరుకుపోయి ఉంది. ఇందుకు తరుచుగా కెప్టెన్లు మారడమే కారణమని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
‘‘పాకిస్థాన్ టీమ్ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే టీమ్ పాక్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ప్రపంచం గర్వపడే టీమ్‌గా ఉన్న పాకిస్థాన్‌ను ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికి కూడా పాకిస్థాన్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)లో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల జట్టు పతనావస్థకు చేరుతోంది. కుర్చీలాటతోనే పాకిస్థాన్ ఈ స్థాయికి దిగజారింది. పాకిస్థాన్ టీమ్ బాగుపడాలంటే అందులో జరుగుతున్న కెప్టెన్ కుర్చీలాటకు ఫుల్ స్టాప్ పెట్టాలి. అంతేకాకుండా ప్రతి ఆటగాడు కూడా జట్టు విజయం కోసం ఆడాలి. జట్టుకన్నా వ్యక్తిగతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదు’’ అని అశ్విన్(Ashwin) చెప్పుకొచ్చాడు.