Women’s Ashes Test | ఏకైక టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

-

Women’s Ashes Test |మహిళల యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరిగిన ఏకైక యాషెస్ టెస్టులో సోమవారం ఆసిస్ మహిళల జట్టు 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 268 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 178 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 116/5తో చివరి రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ మిగతా ఐదు వికెట్లను తొలి సెషన్‌లోనే కోల్పోయింది. డేనియల్ వ్యాట్(54) పోరాటం చేసిన మరో ఎండ్‌లో ఆమెకు సహకారం అందలేదు. ఆఖరి రోజు 21 ఓవర్లపాటే బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ మహిళలు ఓవర్‌నైట్ స్కోరుకు మరో 62 పరుగులు మాత్రమే జోడించి ఆలౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఆష్లీ గార్డ్‌నెర్(8/66) ఇంగ్లాండ్ పతనాన్ని శాసించి ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ముందుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 473 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ మహిళల జట్టు 463 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగుల స్వల్ప ఆధిక్యత సాధించిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 257 పరుగులు చేసి ఇంగ్లాండ్ ముందు 268 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. పురుషుల యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టును దక్కించుకుని ఆస్ట్రేలియా శుభారంభం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -
Read Also:
1. పెళ్లిపై నటి ప్రియమణి షాకింగ్ కామెంట్స్
2. ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...