Australia World Cup Team | వరల్డ్‌కప్‌నకు తుది జట్టు ప్రకటించిన ఆస్ట్రేలియా

-

Australia World Cup Team | ఈ ఏడాది అక్టోబర్ నెలలో పురుషుల వన్డే వరల్డ్‌కప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా తమ ప్రాథమిక జట్టును ప్రకటించింది. దీంతో ప్రపంచకప్‌నకు జట్టును ప్రకటించిన తొలి టీంగా ఆస్ట్రేలియా నిలిచింది. మొత్తం 18 మందితో కూడిన జట్టును సెలెక్ట్ చేసింది. అయితే ఈ 18 మందిలో 15మంది మాత్రమే తుది జట్టులో ఉండనున్నారు. ఇక ఈ జట్టుకు పాట్ కమ్మిన్స్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆరోన్ హార్డీ, జోష్ ఇగ్లిస్, తన్వీర్ సంఘా కొత్తగా జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేసింది. ఇప్పుడు ప్రకటించిన జట్టే త్వరలో సౌతాఫ్రికాతో జరిగే 5 వన్డేల సిరీస్, భారత్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌లోనూ తలపడనుంది.

- Advertisement -

అయితే ఆసీస్ కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా 6 వారాలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకంటిచింది. దీంతో అతడు భారత్, సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లకు దూరం కానున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌కు చోటు దక్కలేదు. 2020లో వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన లబుషేన్ ఇప్పటివరకు 30 వన్డేలు ఆడి 31 సగటుతో 847 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి.

ఆస్ట్రేలియా జట్టు(Australia World Cup Team): పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇగ్లిస్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా

Read Also: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.25వేల వేతనంతో ఉద్యోగాలు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...