టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్(Bangladesh) జట్టు అరుదైన ఘనత సాధించింది. ఢాకాలోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 546 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. 21వ శతాబ్దంలో టెస్టు క్రికెట్‌లో ఇదే అతిపెద్ద విజయంగా నిలిచింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 382 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 146 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత, బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 425 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)ను కేవలం 115 పరుగులకే కట్టడి చేసి, 546 పరుగుల భారీ విజయాన్ని బంగ్లా టీం నమోదు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది మూడో అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) బ్యాట్స్‌మెన్స్, బౌలర్లు సమిష్టిగా రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ మహ్మదల్ హసన్ 76 పరుగులు చేయగా, నంబర్ త్రీ బ్యాట్స్‌మెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 146 పరుగులతో సెంచరీ చేశాడు.
Bangladesh |టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ సంచలన రికార్డు
-