ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో పరుగుల వర్షం కురుస్తోంది. ఆకాశమే హద్దుగా బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. సోమవారం రాత్రి చెన్నై, బెంగళూరు(CSK vs RCB) జట్ల మధ్య జరిగిన మ్యాచులో సిక్సర్ల వర్షం కురిసింది. ఆటగాళ్ల భీకరమైన ఆటతో ఈ మ్యాచ్‌లో ఏకంగా 444 పరుగులు వచ్చాయి. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడడంతో ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త రికార్దు నమోదైంది. అదేటంటే రెండు టీమ్స్ ఆటగాళ్లు కలిపి ఏకంగా 33సిక్సర్లు(చెన్నై17, ఆర్సీబీ16) కొట్టారు. గతంలో 2018 సీజన్లో ఇదే జట్ల మధ్య 33 సిక్సర్లు నమోదుకాగా.. 2020లో చెన్నై, రాజస్థాన్ జట్ల మధ్య కూడా సేమ్ సిక్సర్లు వచ్చాయి. అయితే మూడు రికార్డుల్లో చెన్నై జట్టు కామన్ గా ఉండడం విశేషం.
- Advertisement -
Read Also: అధికార పార్టీ ఎంపీతో హీరోయిన్ పరిణితీ చోప్రా ఎంగేజ్మెంట్ పూర్తి?
Follow us on: Google News, Koo, Twitter


