BCCI to give Rishabh Pant full salary: టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిషబ్ పూర్తిగా కోల్పోవడానికి 8 నెలల సమయం పట్టనున్నట్లు వైద్యులు తెలిపారు. తిరిగి క్రికెట్ ఆడడానికి దాదాపు సంవత్సర కాలం పట్టే అవకాశం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని, జట్టులో మళ్లీ తన ఆట కొనసాగించాలని అభిమానులు, ఇతర ప్లేయర్లు ఆశిస్తున్నారు.
కాగా రిషబ్ పంత్ చికిత్సకు అయ్యే ఖర్చు బాధ్యత అంతా బీసీసీఐ తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా పంత్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ సీజన్లో మ్యాచ్ లు ఆడకున్నా పంత్ కు పూర్తి జీతం ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో గ్రేడ్ ఏ ప్రకారం పంత్ కి ఏటా రూ. కోట్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఎలాంటి మ్యాచ్ ఆడకపోయినా ఈ డబ్బును బీసీసీఐ అతనికి ఇవ్వనుంది. అంతేకాదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా పంత్ కు రావాల్సిన రూ. 16 కోట్లు జట్టుకు అందించాలని ఫ్రాంచైజీని ఆదేశించింది బీసీసీఐ.