బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల..టీమిండియా గ్రాండ్ విక్టరి

0
132

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరి కొట్టింది. ప్రత్యర్థిని 10 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌.. బుమ్రా (6/19) దెబ్బకు 110 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ ఎదుట 111 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని రోహిత్ సేన ఒక్క వికెట్ పడకుండానే పూర్తి చేశారు. రోహిత్ శర్మ (76 నాటౌట్​), శిఖర్ ధావన్‌ (31 నాటౌట్​) అజేయంగా నిలిచారు.