ఫ్లాష్: తెలంగాణలో విషాదం..కుటుంబాన్ని కాటేసిన కరెంటు

0
38

తెలంగాణాలో పెను విషాదం నెలకొంది. విద్యుత్ తీగలు ఆ కుటుంబం పాలిట మృత్యు తీగలుగా మారాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అది ఒకే కుటుంబానికి చెందిన వారు  మృత్యువాత పడ్డారు. అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఉండడం ఇప్పుడు చుట్టపక్కలవారిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ విషాద ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీడీ వర్కర్స్‌ కాలనీలో చోటు చేసుకుంది.

మృతులు రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. బట్టలు ఆరేసుకునేందుకు ఇనుపతీగను కట్టారు. 3 రోజులుగా వర్షం కురవడంతో ఇనుప తీగ విద్యుత్ మీటర్‌కు తగిలి ఒక్కసారిగా కరెంట్ పాస్ అయింది. మొదట తల్లి పర్వీన్ బట్టలు ఆరేసేందుకు వెళ్లింది. కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా అరిచింది. ఏమైందో అని ఆమె భర్త పర్వీన్ వద్దకు వెళ్లగా.. అతనికి షాక్ కొట్టింది. అదే సమయంలో పిల్లలిద్దరూ తల్లిదండ్రుల వద్దకు వెళ్లగా.. విద్యుత్ ప్రసరిస్తున్న వైర్ తగిలి ఒక్కసారిగా నలుగురు విద్యుదాఘాతానికి గురయ్యారు. వర్షం, కరెంటు నలుగురి ప్రాణాలు తీసుకుందని స్థానికులు అనుకుంటున్నారు.