ఈ సింపుల్ చిట్కాలతో ఆభరణాలను శుభ్రం చేసుకోండిలా?

0
31

ఆభరణాలు అంటే ఇష్టపడని మహిళలు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా మహిళలు ఆభరణాలను ధరిస్తూ తమ అందాన్ని రెట్టింపు చేసుకుంటారు. అందుకే ఆభరణాలపై దుమ్ము, ధూళి అలాంటివి  ఏవైనా ఉంటే వాటిని శుభ్రం చేయడానికి వివిధ రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు.

కానీ ఆశించిన మేరకు ఫలితాలు రాకపోవడంతో తీవ్రనిరాశకు లోనవుతుంటారు. కావున అలాంటి వారు ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ఆభరణాలు శుభ్రంగా తయారవుతాయి. పాతబడిన బంగారు నగలను టూత్ బ్రష్,  సబ్బును ఉపయోగించి శుభ్రం చేయడం వల్ల తళతళా మెరుస్తాయి.

వెండి ఆభరణాలు నల్లగా మారినపుడు ఉప్పు కలిపిన నీటిలో బాగా ఉడకబెట్టిన తరువాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల ఆభరణాలు మెరుస్తూ ఉంటాయి. అంతేకాకుండా వెండి ఆభరణాలను అగర్బత్తిల బూడిదతో తోమడం వల్ల శుభ్రపడతాయి.  ముత్యాలను ఆలివ్ ఆయిల్ లో ముంచి దూదితో తుడవడం వల్ల మెరుస్తూ ఉంటాయి.