Rain Alert: తెలంగాణ ప్రజలకు అలెర్ట్..మరో 3 రోజులు అతి భారీ వర్షాలు

0
35

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. గత 5 రోజులుగా ముసురు వదలడం లేదు. ఈ ముసురుతో సూర్యుడు కనిపించకుండా పోయాడు. ఇప్పటికే కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక తాజాగా రాష్ట్రంలో మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ అధికారులు వివరాలు వెల్లడించారు.

ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ, అతి భారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఎల్లుండి భారీ వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు రుతుపవన ద్రోణి జైసాల్మర్, కోట, మాండ్ల , రాయిపూర్, ఝార్సిగూడ,తీవ్ర అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇక నిన్న దక్షిణ ఒరిస్సా- ఉత్తర ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం ఈ రోజు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఒరిస్సా తీరము, పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.

ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి కరెంటు స్తంభాలపై పడి పోల్స్ విరగడం జరుగుతుంటాయి. ఇలాంటి తరుణంలో లైన్స్ తెగడం (తీగలు) జరుగుతాయి. కావున కరెంటు స్తంభాల వద్ద కానీ కరెంటు లైన్ ల కింద ఉండకండి. అదే విదంగా బావులు వద్ద తడిసిన చేతులతో స్టాటర్ డబ్బాలు కానీ, మోటార్ కి వచ్చు సర్వీస్ వైర్ సరి చేసుట ప్రమాదకరం కావున జాగ్రత్త ఉండాలని విద్యుత్ అధికారులు కోరారు.