మహిళల వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్(Nikhat Zareen)ను సీఎం కేసీఆర్ అభినందించారు. న్యూ ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో 50 కేజీల విభాగంలో వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి స్వర్ణం సాధించింది. స్వర్ణ పతకాన్ని సాధించడంపై సీఎం మీడియా ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని ప్రశంసించారు. వరుస విజయాలతో దేశఖ్యాతిని నిఖత్ జరీన్ మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Read Also: నేను కాంగ్రెస్ మనిషినే.. సొంతగూటికి చేరాక ధర్మపురి శ్రీనివాస్
Follow us on: Google News, Koo, Twitter