David Warner: డీజే టిల్లుగా వార్నర్‌ మామ..!

-

David Warner post latest video of his dj tillu version: ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ అయినప్పటికీ తెలుగు ప్రజలంతా మామా అంటూ పిలుచుకునే డేవిడ్‌ వార్నర్‌ మరో అవతారం ఎత్తాడు. అదేనండీ.. మరొక గెటప్‌తో తెలుగు ప్రజలను అలరించేందుకు ఓ వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ప్రముఖ తెలుగు సినిమాలలోని వీడియోలను తన ఫేస్‌తో మార్ఫింగ్‌ చేసి.. ఫన్నీగా అందరి మోముల్లో నవ్వులు తెప్పించే వార్నర్‌ మామ ఇప్పుడు డీజే టిల్లుగా కనిపించాడు. ఆ సినిమాలో మన కథానాయకుడు సందు చివర కటింగ్‌ షాపుకు వెళ్లి.. ప్రిన్స్‌ మహేష్‌ బాబు కటింగ్‌ చేయమనటం.. బార్బర్‌ షాప్‌ ఆయన మరొక కటింగ్‌ చేయటం ఎంత ఫన్‌ క్రియేట్‌ చేసిందో, ప్రేక్షకులను ఎంతలా నవ్వించిందో అందరికీ తెలిసిన విషయమే.

- Advertisement -

ఇప్పుడు ఆ సీన్‌లో మన కథానాయకుడు ఫేస్‌కు బదులు, వార్నర్‌ మామ తన ఫేస్‌ను పెట్టి, అంతే ఫన్‌ క్రియేట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. గతంలో బాహుబలి, పుష్ప వంటి సినిమాల వీడియోలలో తన ఫేస్‌తో మార్ఫింగ్‌ చేసి.. రిలీజ్‌ చేసిన వీడియోలు ఎంత పాపులర్‌ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఐపీఎల్‌ పుణ్యమా అని, వార్నర్‌ హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడటంతో, తెలుగు వారందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు వార్నర్‌.

Click here :  

https://www.instagram.com/reel/Ck5P66rti7Y/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...